Karimnagar: ఘనంగా సందల్ ఉత్సవం
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:25 AM
జమ్మికుంట రూరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ దర్గాలో సందల్ ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్న దర్గా.
జమ్మికుంట రూరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ దర్గాలో సందల్ ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్రత్ సయ్యద్ ఇంకూషావలి రహమతాల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్‌షావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అక్భర్‌షావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావలి రహమతుల్లాఅలై సమాధులను భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు సందల్ (గంధ లేపనం) ఉత్సవాన్ని నిర్వహించారు. సందల్‌ను మొల్లాపల్లి పెద్ద బిజిగిరిషరీఫ్ నుంచి వేలాది భక్తుల ఆనందోత్సవాల నడుమ, మేళాతాళాల మధ్య దర్గాకు తీసుకువచ్చారు. సంధల్‌ను దర్గాలోని సమాధులకు అలంకరించారు. మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ముజావర్లు హైదరాబాద్ నుంచి తెచ్చిన ప్రత్యేక చాదర్లు దర్గాలోని సమాధులకు సమర్పించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హుజూరాబాద్ ఏసీపీ మాధవి, పట్టణ సీఐ ఎస్ రామకృష్ణగౌడ్, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దర్గా ముతావలి మహమ్మద్ అక్బర్ అలీ, కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.