Share News

Karimnagar: ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:29 AM

వీణవంక, జూన్‌ 4 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని చల్లూరు, నర్సింహులపల్లి గ్రామంలో ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ వొడి తెల ప్రణవ్‌ పట్టాలను పంపిణీ చేశారు.

Karimnagar:   ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు

వీణవంక, జూన్‌ 4 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని చల్లూరు, నర్సింహులపల్లి గ్రామంలో ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ వొడి తెల ప్రణవ్‌ పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క రికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తా మన్నారు. అనంతరం నర్సింగాపూర్‌ లోని రేణుక ఎల్లమ్మతల్లిని దర్శించు కొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌ రెడ్డి, సాహెబ్‌ హుస్సేన్‌, శ్రీపతిరెడ్డి, రాకేష్‌రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట రూరల్‌: మండలంలోని జగ్గయ్యప ల్లిలో మార్కెట్‌కమిటీవైస్‌ చైర్మన్‌ ఎర్రం సతీష్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌పార్టీమండలఅధ్యక్షుడు పరశురాములు ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలోఉన్న బీఆర్‌స్‌పార్టీ ప్రభు త్వం నిరుపేదలకు ఒక్కఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ రాజేశ్వర్‌రావు, స్పెషల్‌ ఆఫీసర్‌ శైలజాదేవి, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు: ప్రతినిరుపేద కుటుంబానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తుందని గోపాల్‌ రావుపేట మార్కెట్‌కమిటీచైర్మన్‌ బొమ్మరవేని తిరు మల అన్నారు. బుధవారం రామడుగులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జవ్వాజి హరీష్‌తోకలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలఅధికారులు సరైన లబ్ధిదారు లకు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ పిండి సత్యం, వెన్న రాజమల్లయ్య, శ్రీనివాస్‌, కాడే శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:29 AM