Share News

Karimnagar: రహదారులు.. చెరువులుగా..

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:29 AM

కరీంనగర్‌ టౌన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, గాలి దుమారం జనాన్ని అతలాకుతలం చేశాయి.

Karimnagar:  రహదారులు.. చెరువులుగా..

- నగరంలో భారీ వర్షం

- లోతట్టు ప్రాంతాలు జలమయం

- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న జనం

- విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, గాలి దుమారం జనాన్ని అతలాకుతలం చేశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడక్కడా ఏర్పడిన గుంతల్లో వాహనాలు దిగబడి మెరాయించాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఫ స్తంభించిన ట్రాఫిక్‌..

కరీంనగర్‌ క్రైం: నగరంలో కురిసిన వర్షానికి రాంనగర్‌ నుంచి ఇందిరాచౌక్‌ వరకు రోడ్లపై మోకాలులోతు వరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. వర్షం కురుస్తుండడంతో సిగ్నల్‌ వ్యవస్థను నిలిపివేయడంతో నాలుగువైపుల నుంచి వాహనాలు వచ్చి ట్రాఫిక్‌ స్తంభించింది. సిగ్నల్‌ నుంచి జయరాం హాస్పిటల్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. సిగ్నల్‌ వద్ద, మంకమ్మతోటలోని టూటౌన్‌ సమీపంలోని రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

ఫ జాతీయ రహదారిపై నిలిచిన వర్షపు నీరు

శంకరపట్నం: మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు అరగంట వర్షం ఏకధాటిగా కురవడంతో నీరు రోడ్డు మీద భారీగా నిలిచిపోయింది.

Updated Date - Jul 20 , 2025 | 12:29 AM