22న కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభం
ABN , Publish Date - May 19 , 2025 | 12:29 AM
కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22న వర్చువల్‌గా ప్రారంభిస్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్బంగా రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.
కరీంనగర్ రూరల్, మే 18 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22న వర్చువల్‌గా ప్రారంభిస్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్బంగా రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈనెల 22న ప్రదాన మంత్రి నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించబోతున్నారని తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌నూ అదే రోజు ప్రారంభిస్తారన్నారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనలో 17 మంది మరణించడం తీవ్ర దిగ్ర్బాంతిని కలిగించిందన్నారు. చిన్నారులు కూడా మరణించడం భాదకరణమని అన్నారు. దీనిపై కేంద్రం స్పందించిందని తెలిపారు. ప్రదాని నరేంద్ర మోదీ మృతులకు రెండులక్షల రూపాయలు ఆర్థిక సాయం, గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంంతాపంతోనే సరిపెట్టడం శోచనీయమన్నారు. వారికి మెరుగైన వైద్యం అందిచాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ఇప్పటి వరకు లక్షన్నర కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించాము, ఏ విధమైన అభివృద్ధి చేశామనే అంశం పై శ్వేత పత్రం విడుదల చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్థిస్థాయిలో సహకరించడం లేదని తెలిపారు. విమర్శలకే పరిమితమవుతూ అభివృద్దికి అడ్డుగా మారుతుందన్నారు. ఇకనైనా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కలిసి రావాలని కోరారు. కరీంనగర్ రైల్టే స్టేషన్ ఆఽధునీకరణ కోసం 33.3 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పజెప్పామని, వచ్చే జూన్ వరకు పూర్తి అవుతాయని తెలిపారు. ఇప్పటికీ భూ సేకరణ పూర్తికాకపోవడం కాస్తా ఇబ్బందిగా మారిందని, కొత్త కాంట్రాక్టర్ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను కూడా ఆధునీకరిస్తామని తెలిపారు. కరీంనగర్‌లో బడ్జెట్ కంటే మరో రెండు కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి రోడ్లు, మురికి కాలువలు నిర్మించామన్నారు. జూన్ నాటికి ప్రజల రాక పోకలకు ఇబ్బంది లేకుండా వన్ లైన్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కరీంనగర్-తిరుపతి రైలు డైలీ సర్వీస్‌గా మార్చేందుకు సాధ్యాసాధ్యాలను రైల్వే శాఖ పరిశీలిస్తోందని తెలిపారు. కరీంనగర్ - జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులను మూడు నెలల్లో టెండర్లు పూర్తవుతాయని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి గడ్కరీతో ఇటీవల మాట్లాడనని తెలిపారు. తీగల గుట్టపల్లి ఆర్వోబీ పనులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అదికారులను పిలిచి కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, వసాల రమేష్, మాజీ మేయర్ సునీల్‌రావు, మాజీ డిప్యూటి మేయర్ గుగ్గిళ్ల రమేష్, కొలగాని శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, రైల్వే మేనేజర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు.