Karimnagar: బిల్లులు రాక ఇబ్బందులు
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:52 AM
మానకొండూర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మానకొండూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బిల్లులు రాక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
మానకొండూర్‌లో బేస్‌మెంట్ వరకు నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు
- అయోమయంలో ఇందిరమ్మ లబ్ధిదారులు
మానకొండూర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మానకొండూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బిల్లులు రాక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ముంజంపల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద మొదటి విడతలో 140 ఇళ్లను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. మండలంలో మొత్తం 852 ఇళ్లు మంజూరయ్యాయి. 492 ఇళ్లకు మార్కింగ్ ఇవ్వగా 195 మంది లబ్దిదారులు బేస్‌మెట్ వరకు నిర్మించారు. మొదటి విడుత కింద లక్ష రూపాయల బిల్లు రావాల్సి ఉంది. పనులు పూర్తయినా డబ్బులు ఇంకా బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మొదటి విడుత బిల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.