Share News

Karimnagar: ‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:26 AM

తిమ్మాపూర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టంతో భూసంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

 Karimnagar:   ‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

తిమ్మాపూర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టంతో భూసంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలం లోని పొరండ్లలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. గ్రామాల్లో ఎవరికైనా భూ సంబంధ సమస్యలుంటే ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. కార్యక్రమం లో మండలతహసీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ రాకేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎస్‌ఎల్‌ గౌడ్‌, బండారి రమేష్‌, నాయకులు పాల్గొన్నారు.

పంట మార్పిడి చేస్తూ

అధిక ఆదాయాన్ని గడించాలి..

గన్నేరువరం: రైతులు పంట మార్పిడి చేస్తూ అధిక ఆదాయాన్ని పొందాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పారు వెల్ల గ్రామంలో నిర్వహిస్తున్న రైతుముంగిల్లో శాస్త్రవేత్తలు కార్యక్ర మాన్ని హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ యూరియా వాడ కాన్ని తగ్గించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మండల ఏవో కిరణ్మయి, శాస్త్రవేత్తలు ఉషారాణి, శ్రావణి, మఽధూకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

పేదప్రజలకు అండగా కాంగ్రెస్‌ప్రభుత్వం: పేదప్రజలకు ఆరుగ్యారంటీల అమలుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం గన్నేరువరం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో అధికారులు నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై 307మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ ఎం గంగా ధర్‌, మండల ప్రత్యేకాధికారి రామానుజాచారి, ఎంపీడీవో శ్రీనివాస్‌, అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ: ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ మండల వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కొలుపుల రవిందర్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే బుధవారం పరామర్శించారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - Jun 05 , 2025 | 12:26 AM