Share News

Karimnagar: పోలీసులకు సీపీఆర్‌పై శిక్షణ

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:46 PM

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు అవలంబించాల్సిన సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రెసిసికేషన్‌) పద్ధతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసు కమిషనర్‌ గౌస్‌ఆలం అన్నారు.

 Karimnagar:   పోలీసులకు సీపీఆర్‌పై శిక్షణ

- సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు అవలంబించాల్సిన సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రెసిసికేషన్‌) పద్ధతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసు కమిషనర్‌ గౌస్‌ఆలం అన్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు జరుగుతున్న సీపీఆర్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా గురువారం కమిషనరేట్‌ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్‌లో పోలీసు అధికారులకు, సిబ్బందికి కంటి పరీక్షలతోపాటు సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సమాజంలో ఫస్ట్‌ రెస్పాండర్‌గా పోలీసులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ముఖ్యంగా బ్లూ కోల్ట్స్‌ అధికారులు వెంటనే స్పందించి సీపీఆర్‌ చేసినట్లయితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఇతరులకు, కుటుంబ సభ్యులకు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, భీం రావు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సనా, డాక్టర్‌ నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 11:46 PM