Karimnagar: మొక్కలు నాటి సంరక్షించాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:00 AM
కరీంనగర్ టౌన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వనమమహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు.
- నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
కరీంనగర్ టౌన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వనమమహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నగరపాలక సంస్థ ద్వారా నాటిన మొక్కలను కమిషనర్ పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరీంనగర్‌ను గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా నర్సరీల్లో పెంచిన మొక్కలను ఇప్పటికే చాలా చోట్ల ఖాళీ ప్రదేశాలను గురించి యాదాద్రి, మియావాకీ బ్లాక్‌లుగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఇంటి పరిసరాలు, ఖాళీ ప్రదేశాల్లో ప్రతిచోట పూలు, పండ్లు, ఔషధ మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు.