Share News

Karimnagar: అమరవీరుల వారోత్సవాల్లో ప్రజలు భాగస్వాములవ్వాలి

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:04 AM

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని సీపీ గౌస్‌ఆలం కోరారు.

Karimnagar:  అమరవీరుల వారోత్సవాల్లో ప్రజలు భాగస్వాములవ్వాలి

- సీపీ గౌస్‌ ఆలం

- పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని సీపీ గౌస్‌ఆలం కోరారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నగరంలో 20 కిలోమీటర్ల సైకిల్‌ ర్యాలీని శనివారం నిర్వహించారు. ఈ ర్యాలీని సీపీ గౌస్‌ఆలం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వారోత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న వారందరికీ సీపీ మెడల్స్‌ అందించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్‌, యాదగిరిస్వామి, మాధవి, అల్ఫోర్స్‌ అధినేత నరేందర్‌రెడ్డి, కరీంనగర్‌ కమిషనరేట్‌ రన్నర్స్‌, సైక్లిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ పసుల, డాక్టర్‌ అజయ్‌ ఖండాల్‌, డాక్టర్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

ఫ పీటీసీలో రక్తదాన శిబిరం

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్‌ పోలీస్‌ టైన్రింగ్‌ కళాశాల(పీటీసీ)లో శనివారం ‘గివ్‌ బ్లడ్‌ - సేవ్‌ లైఫ్‌’ నినాదంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సీపీ గౌస్‌ఆలం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్‌, అడిషనల్‌ ఎస్పీ ఎం పిచ్చయ్య మాట్లాడుతూ.. ఈ క్యాంపు ద్వారా సేకరించిన మొత్తం 80 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని బ్లడ్‌ సెంటర్‌కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డీఎస్పీ బి మోహన్‌, జి విజయపాల్‌రెడ్డి, సీహెచ్‌ మల్లికార్జున్‌, బి గంగాధర్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, రిజర్డ్‌ ఇన్‌స్పెక్టర్లు మహేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:04 AM