Karimnagar: పెండింగ్‌లో ఉన్న పారితోషికం చెల్లించాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:31 AM
సుభాష్‌నగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ పారితోషికాన్ని వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత డిమాండ్ చేశారు.
బుట్టి రాజారాం కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట దర్నా చేస్తున్న ఆశా వర్కర్లు
సుభాష్‌నగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ పారితోషికాన్ని వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆశా వర్కర్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై నెలకు సంబంధించిన పారితోషికాన్ని ఇప్పటి వరకు అందించలేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పారితోషికాన్ని ప్రతి నెల 30లోపు చెల్లించాలని, 18 వేల రూపాయల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా, ఏ జిల్లాలో లేని విధంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఆశ వర్కర్లపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం సభను పెట్టి ఆశ వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 25న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే సమ్మేలోకి వెళతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగవెల్లి పద్మ, కార్యదర్శి బోయిన ప్రియాంక, కల్పన, అంజలి, లక్ష్మి, సునీత, సుజాత, సరోజన పాల్గొన్నారు.