Share News

Karimnagar: విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:44 PM

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్స వాలలో భాగంగా గురువారం కమిషనరేట్‌ కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు.

Karimnagar:  విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌

- స్టాల్స్‌ను పరిశీలించిన సీపీ గౌష్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్స వాలలో భాగంగా గురువారం కమిషనరేట్‌ కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఓపెన్‌ హౌస్‌ ద్వారా విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పనితీరు, విధి నిర్వహణలో ఉప యోగించే వివిధ పరికరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా, డాగ్‌ స్క్వాడ్‌ (పోలీసు జాగిలాలు), ఆయుధాలు, అన్ని రకాల తుపాకులు, అల్లర్ల నియంత్రణకు వినియో గించే స్మోక్‌ గన్‌, షెల్స్‌, బాంబు నిర్వీర్య విభాగం పని విధానాన్ని వివరించారు. అలాగే డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, పోలీసులు వినియోగించే కమాండ్‌ కంట్రోల్‌ వాహనం, అల్లరిమూ కలను చెదరగొట్టేందుకు వినియోగించే స్మోక్‌ షెల్స్‌ను పేల్చేందుకు వీలుగా వుండే వజ్ర వాహనం ప్రదర్శనలో ఉంచారు. వివిధ స్టాల్స్‌ను, ఆయుధాలను సీపీ గౌష్‌ ఆలం పరివీలించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు పాటుపడుతామంటూ పోలీసు అధికారులు, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌కమిషనర్‌ గౌష్‌ ఆలం మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబరు 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్స వాలను విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. సైబర్‌ మోసాలబారినపడితే వెంటనే 1930, డయల్‌ 100కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరి స్వామి, సీఐలు సృజన్‌రెడ్డి, పుల్లయ్య, ఆర్‌ఐ జానిమియా తదితరులు పాల్గొన్నారు.

ఫ కరీంనగర్‌ టూటౌన్‌లో గురువారం ఓపెన్‌హౌజ్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైబర్‌ క్రైం, డ్రగ్స్‌, ఎఫ్‌ఐఆర్‌లపై అవగాహన కల్పించారు. టూటౌన్‌ సీఐ రాంచందర్‌రావు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ ఓపెన్‌హౌజ్‌లో కరీంనగర్‌లోని నారాయణ స్కూల్‌, అచీవర్స్‌ స్కూల్‌, వివేకానంద స్కూల్స్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:44 PM