Karimnagar: పోలీస్ కమిషనరేట్‌కు నూతన లోగో
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:48 PM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త లోగోను ప్రతిపాదిస్తూ, లోగో మార్పునకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన లోగోలు
కరీంనగర్ క్రైం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త లోగోను ప్రతిపాదిస్తూ, లోగో మార్పునకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ భద్రత, శాంతి భద్రతల సంరక్షణలో నిబద్ధతను సూచించేలా ఈ లోగోను రూపొందించారు. ఈ లోగోలో హు డేర్స్, విన్స్ అనే పదం ఉంటుంది. ధైర్యం చేసేవాడు గెలుస్తాడని దీని అర్థం. లోగోలో కనిపించే అశోక చక్రం, నాలుగు సింహాల చిహ్నం దేశభక్తిని, శక్తిని, ప్రజలపై నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. నూతన లోగో గురించి సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ కొత్త లోగో కమిషనరేట్ పోలీసుల్లో కొత్త స్ఫూర్తిని నింపుతుందన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు తాము ఎల్లప్పుడు కట్టుబడి ఉంటామన్నారు. డీజీపీ జితేందర్ ఈ నూతన లోగో ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారికంగా అమల్లోకి వచ్చిందని తెలిపారు. కొత్త లోగో పోలీస్ కమిషనరేట్‌లోని అందరి యూనిఫాంలు, వాహనాలు, అధికారిక పత్రాలపై ఉపయోగిస్తామని సీపీ గౌస్ ఆలం తెలిపారు.
ఫ నూతన కానిస్టేబుళ్లకు టెక్నాలజీపై శిక్షణ
కమీషనరేట్ పరిధిలోని పోలీసుఠాణాలలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై దశలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. గురువారం రెండో బ్యాచ్ శిక్షణ ముగించినట్లు ఆయన తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్‌లు, సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఏసీపీలు జి విజయకుమార్, వేణుగోపాల్, సీఐలు తిరుపతి, సరిలాల్, శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనివాస్, తి రుమల్ పాల్గొన్నారు.