Karimnagar: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:03 AM
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నాగుల చవితి పూజలను జిల్లా వాసులు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నాగుల చవితి పూజలను జిల్లా వాసులు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పుట్టల్లో పాలు పోసి బియ్యం, నువ్వుల పిండి ముద్దలు, నూక, గుడ్లు, పండ్లు, వెండి చెవులు, కళ్లు, పడిగెలు సమర్పించి పుట్ట మట్టిని బంగారంగా భావించి తిలకధారణ చేసుకున్నారు. యజ్ఞవరాహస్వామిక్షేత్రంలో, కృష్ణానగర్, చైతన్యపురి మహాశక్తి ఆలయంలో, పాతబజార్ శివాలయం, భగత్‌నగర్ అంజనాద్రి, అయ్యప్ప, రాంపూర్ గిద్దెపెరుమాళ్లు, ప్రశాంతనగర్ ప్రసన్నాంజేయస్వామి ఆలయాల్లోని సుబ్రహ్మణ్య, నాగేంద్రస్వామి ఆలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బొమ్మకల్‌రోడ్ చింతలకింద, శ్రీపురం సమీపంలో, కోర్టు చౌరస్తా వద్ద గల పుట్టల్లో భక్తులు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.