Karimnagar: ప్రజల బాధలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:19 AM
భగత్‌నగర్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో మున్సిపల్ అధికారులు ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు.
భగత్‌నగర్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో మున్సిపల్ అధికారులు ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. గురువారం కట్టరాంపూర్ నుంచి కోతిరాంపూర్ వెళ్లే దారిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతిరాంపూర్ రోడ్డు కొన్ని సంవత్సరాలుగా వాహనదారులు, పాదాచారులు నడవలేని దుస్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్మార్ట్ సిటీలో అంతర్గత రోడ్లను పట్టించుకోవడం లేదన్నారు. నగరంలో రహదారి పనులు, అర్థంతరంగా వదిలిపెట్టిన రోడ్ల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. లేకుంటే నగరంలో ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీపీఐ కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, నగర కార్యవర్గ సభ్యుడు కసిబోజుల సంతోషచారి, గామినేని సత్యం, అనంతగిరి, రమేష్, మాదాసు రాములు, శంకర్, సందీప్, నాగరాజు, బ్రహ్మం, శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.