Karimnagar: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని మానవహారం
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:12 AM
గణేశ్‌నగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్సారార్ కళాశాల ఎదుట సోమవారం మానవహారం నిర్వహించారు.
గణేశ్‌నగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్సారార్ కళాశాల ఎదుట సోమవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి యోగేష్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విగ్నేష్, వంశీ, విష్ణు, థామస్, అభి, కోషిక్, మనోజ్, శివ సాయి, నిఖిల్, ప్రశాంత్, ఆకాష్, మురళి, రాజేష్, సాయికృష్ణ పాల్గొన్నారు.