Karimnagar: మత్స్యకారుల రాష్ట్ర సభలను జయప్రదం చేయండి
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:27 PM
సుభాష్‌నగర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మత్స్యసహకార సంఘాల సమాఖ్య మాజీ ఉమ్మడి రాష్ట్ర చైర్మెన్ చేతి ధర్మయ్య పిలుపునిచ్చారు.
సుభాష్‌నగర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మత్స్యసహకార సంఘాల సమాఖ్య మాజీ ఉమ్మడి రాష్ట్ర చైర్మెన్ చేతి ధర్మయ్య పిలుపునిచ్చారు. నగరంలోని మెడికల్ రిప్రజంటేటివ్స్ భవన్‌లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార వృత్తి రక్షణ-ఉపాధి, సామాజిక భద్రత సాధనకు ఈనెల 25 నుంచి 27 వరకు కరీంనగర్‌లో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సుదీర్ఘ పోరాటాల అనుభవాలు, చరిత్ర కలిగిన సంఘం, ఉమ్మడి రాష్ట్రంలో అనేక రాజీలేని పోరాటాలను నిర్వహించిందన్నారు. మత్స్యకారులకు ఆరు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, నాణ్యమైన ఉచిత చేప పిల్లలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులు, కుంటలను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఎదురుగా గల రెవెన్యూ గార్డెన్‌లో ఈనెల 25న నిర్వహించే బహిరంగ సభలో వేలాది మంది మత్స్యకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డోలి రాజయ్య, తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు పిట్టల వెంకటేశం, జునగరి గణేశ్, కోశాధికారి పప్పు సదానందం, మర్రి శశికళ, నాగుల అరుణ, షేర్వ మల్లిఖార్జున్, జడిగల రాజన్న, కొత్తూరి అంజి పాల్గొన్నారు.