Share News

Karimnagar: మాదిగలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

ABN , Publish Date - May 30 , 2025 | 12:03 AM

సుభాష్‌నగర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తెలంగాణ అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సముద్రాల అజయ్‌, సుద్దాల లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

Karimnagar: మాదిగలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

సుభాష్‌నగర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తెలంగాణ అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సముద్రాల అజయ్‌, సుద్దాల లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిగలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో మాదిగ జనాభా దామాషా ప్రకారం మాదిగలకు చోటు కల్పించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం చొరవ తీసుకుని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు మంత్రిగా అవకాశం కల్పిస్తే మరిన్ని సేవలు అందిస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కోండ్ర సంపత్‌కుమార్‌, గోష్కి శంకర్‌, ఆవారు లత, కల్వల ఆనంద్‌, చిలుముల నవీన్‌, సిరిసిల్ల నర్సయ్య, రవిందర్‌యాదవ్‌, తప్పట్ల అంజయ్య, గాలిపెల్లి సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 12:03 AM