Karimnagar: గ్రంథాలయాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:05 AM
కరీంనగర్ కల్చరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని గ్రంథాలయాలను యువత వినియోగించుకుని ఉన్నత ప్రతిభావంతులుగా ఎదగాలని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య అన్నారు.
- వారోత్సవాల ముగింపు వేడుకలో చైర్మన్ సత్తు మల్లయ్య
కరీంనగర్ కల్చరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని గ్రంథాలయాలను యువత వినియోగించుకుని ఉన్నత ప్రతిభావంతులుగా ఎదగాలని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోటీ పరీక్షల అభ్యర్థులు, విద్యార్థులు, పాఠకుల కోసం మరిన్ని పుస్తకాలు తెప్పిస్తామని అన్నారు. నిష్ణాతులతో కోచింగ్, ఉపన్యాసాలు ఇప్పిస్తామని తెలిపారు. వారానికొకసారైనా గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. మెరుగైన వసతుల రూపకల్పనపై దృష్టి సారించామని తెలిపారు. అంతకు ముందు కవి అన్నవరం దేవేందర్ తన పుస్తకాలను ఆవిష్కరింపజేసి గ్రంథాలయానికి అందజేశారు. అనంతరం టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, నాయకులు సంగెం లక్ష్మణరావు, హర్మిందర్‌సింగ్, ఎం కిరణ్‌కుమార్ మాట్లాడారు. గ్రేడ్-3 లైబ్రేరియన్ పి నాగభూషణం నివేదిక సమర్పించారు. అనంతరం వారం రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. సంస్థ కార్యదర్శి ఎ సరిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేడ్-1 లైబ్రేరియన్ వి అర్జున్, గ్రేడ్-3 లైబ్రేరియన్ జి సరిత, జూనియర్ అసిస్టెంట్ కె మల్లయ్య, రికార్డ్ అసిస్టెంట్ జె గౌతమి పాల్గొన్నారు.