Karimnagar: అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయి
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:21 AM
కరీంనగర్ కల్చరల్, డిసెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): పిడికెడు అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయని, అణుబాంబు కంటే బలమైంది కవిత్వమని సినీ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ అన్నారు.
- కాళోజీ పురస్కారాల ప్రదానంలో ‘పెద్దింటి’
కరీంనగర్ కల్చరల్, డిసెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): పిడికెడు అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయని, అణుబాంబు కంటే బలమైంది కవిత్వమని సినీ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఫిలింభవన్‌లో అధ్యక్షుడు కొత్త అనిల్‌కుమార్ అఽధ్యక్షతన కాళోజీ నారాయణరావు రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. 2024కుగాను సిద్దిపేటకు చెందిన పప్పుల రాజిరెడ్డికి, 2025కుగాను బోధన్‌కు చెందిన మొగిలి స్వామికి అశోక్‌కుమార్ చేతుల మీదుగా పురస్కా రాలను అందించారు. అనంతరం అశోక్‌కుమార్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో దోహ దపడే కవుల పాత్రకు పురస్కారాలు అసలైన గుర్తింపునిస్తాయని అన్నారు. పురస్కారమంటే కవిత్వానికి పట్టం కట్టడమేనని తెలిపారు. అతిథులుగా హాజరైన సుదర్శనం వేణుశ్రీ, గుండేటి రాజు, కాండూరి వేంకటేశ్వర్లు మాట్లాడారు. పురస్కార గ్రహీతల పరిచయాలను అన్నాడి గజేందర్‌రెడ్డి, స్తంభంకాడి గంగాధర్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దొమ్మాటి శంకరప్రసాద్, నీలగిరి అనిత, బొమ్మకంటి కిషన్, గంగుల శ్రీకర్, చిందం సునీత, కాసు మహేందర్‌రాజు, గందె పరశురాములు, రేగులపాటి విజయలక్ష్మి, సుగుణ, కూకట్ల తిరుపతి, మర్రిపల్లి మహేందర్, సిహెచ్ రజిత తదితరులు పాల్గొన్నారు.