Karimnagar: మావోయిస్టులను హతం చేయడం దుర్మార్గం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:06 AM
చిగురుమామిడి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై అవగహన లేకుండ ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను హతం చేయ్యడం దుర్మార్గమని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఆన్నారు.
- బీసీ రిజర్వేషన్ల్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి
- సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంటకరెడ్డి
చిగురుమామిడి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై అవగహన లేకుండ ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను హతం చేయ్యడం దుర్మార్గమని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఆన్నారు. గురువారం మండల కేంద్రంలోని ముస్కురాజిరెడ్డి స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విదానాన్ని రాష్ట్ర ప్రజలు ఎండగట్టాలన్నారు. కేంద్రా ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ ప్రజల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఈ నెల 26న ఖమ్మంలో నిర్వహించే సీపీఐ వందేళ్ల ఉత్సవాల బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, చాడ శ్రీధర్‌రెడ్డి, అందె చిన్న స్వామి, రాకం అంజవ్వ, బూడిద సదాశివ, సింగిల్ విండో డైరెక్టర్లు ముద్రకోల రాజయ్య, మాజీ సర్పంచ్‌లు గోళి బాపురెడ్డి, మావురపు రాజు, తెరాల సత్యనారయణ, బోయిని పటేల్ పాల్గొన్నారు.