Share News

Karimnagar: ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:11 PM

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు.

Karimnagar:   ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు పూర్తి చేయాలి

- కలెక్టర్‌ పమేలాసత్పతి

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్‌ భవనాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినియోగదారులకు మార్కెట్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులతో కలెక్టర్‌ మాట్లాడారు. ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు చేయించుకున్నారా అని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బీపీ, షుగర్‌తోపాటు అన్నిరకాల వ్యాధులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ వేణుమాధవ్‌, శానిటరీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:11 PM