Karimnagar: ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు
ABN , Publish Date - May 30 , 2025 | 12:02 AM
రామడుగు, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోపాల్‌రావుపేటలో ఎరువులు, విత్తనాల దుకాణాలను వ్యవసాయ అధికారులు తనిఖీచేశారు.
గోపాల్‌రావుపేటలో చంటి బిడ్డతో కలిసి రికార్డులను పరిశీలిస్తున్న ఏవో
రామడుగు, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోపాల్‌రావుపేటలో ఎరువులు, విత్తనాల దుకాణాలను వ్యవసాయ అధికారులు తనిఖీచేశారు. మండల వ్యవసాయఅధికారి త్రివేదిక దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దుకాణాల్లో పూర్తిస్థాయి తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. లూజు విత్త నాలు, నాణ్యతలేని విత్తనాలను అమ్మి తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ప్రతిరైతు రశీదు తీసుకోవాలని సూచించారు. కాగా సంవత్సరం బాబుతో కలిసి ఆమె దుకాణాలను తనిఖీ చేశారు. చిన్నారి కొంత ఏడుస్తూ ఇబ్బంది పెట్టినప్పటికీ ఆమె బాబును బుజ్జగిస్తూ తన పనులను చేసుకోవడం విశేషం.