Share News

Karimnagar: వృద్ధులపై వేధింపులు బాధాకరం

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:22 PM

కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు వయోవృద్ధులపై వేధింపులు పెరిగిపోతుండడం బాధాకరమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె వెంకటేష్‌ అన్నారు.

Karimnagar:  వృద్ధులపై వేధింపులు బాధాకరం

- జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె వెంకటేష్‌

కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు వయోవృద్ధులపై వేధింపులు పెరిగిపోతుండడం బాధాకరమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె వెంకటేష్‌ అన్నారు. ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల నిరోధక దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలోని ప్రభుత్వ వయోవృద్ధుల వసతి గృహంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె వెంకటేష్‌ మాట్లాడుతూ పెద్దలు, వయోవృద్ధుల సలహాలు, మార్గనిర్దేశం వల్లనే వారి పిల్లలు వృద్ధిలోకి వస్తారన్నారు. ఈ సందర్భంగా ఏ విధమైన న్యాయ సలహాలకైనా, సమస్యలకైనా టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100కు కాల్‌ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ తణుకు మహేష్‌, వయోవృద్ధుల గృహ నిర్వాహకురాలు రాధిక పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:22 PM