Karimnagar: నల్లగొండలో ఘనంగా శకటోత్సవం
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:34 PM
తిమ్మాపూర్, మార్చి 14, (ఆంధ్రజ్యోతి): మండలంలోని నల్లగొండ సీతారామ లక్ష్మి నృసింహ స్వామి దేవస్ధానంలో శకటోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

తిమ్మాపూర్, మార్చి 14, (ఆంధ్రజ్యోతి): మండలంలోని నల్లగొండ సీతారామ లక్ష్మి నృసింహ స్వామి దేవస్ధానంలో శకటోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయం చూట్టు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, కార్యనిర్వహక అధికారి నాగుల అనిల్ కుమార్, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎల్‌ఎండీ ఎస్సై వివేక్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.