Share News

Karimnagar: కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:48 PM

రామడుగు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్‌ పమేలా సత్పతి రైతులకు సూచించారు.

Karimnagar:  కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

- కలెక్టర్‌ పమేలాసత్పతి

రామడుగు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్‌ పమేలా సత్పతి రైతులకు సూచించారు. గురువారం రామడుగు మండలం వెదిర రైతు వేదిక ప్రాంగణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , టీసెర్ఫ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాల్‌కు ఏ గ్రేడ్‌ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మద్దతు ధరతోపాటు సన్నరకాలకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తుందని అన్నారు. రైతులు తమ పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. సన్నరకం వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 బోనస్‌ ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అనిల్‌ ప్రకాశ్‌, పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:48 PM