Karimnagar: ‘షీ లీడ్స్’తో సత్ఫలితాలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:22 PM
కరీంనగర్ క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ‘షీ లీడ్స్’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు.
కరీంనగర్ క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ‘షీ లీడ్స్’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. కమిషనరేట్ కేంద్రంలో రెండు విడతల్లో 102 మంది మహిళా కానిస్టేబుళ్లు, షీ-టీమ్స్ సభ్యులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ మనల్ని మనం రక్షించుకునే స్థితిలో ఉన్నప్పుడే ప్రజలను సమర్థవంతంగా రక్షించగలమని ఉద్ఘాటించారు. శారీరక, మానసిక దృఢత్వమే లక్ష్యంగా ఈ శిక్షణను రూపొందించినట్లు ఆయన తెలిపారు. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో మేమున్నాం అనే భరోసాను కల్పించేలా మహిళా బ్లూ కోల్ట్స్ సిద్ధమయ్యారని సీపీ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్ జి, వేణుగోపాల్, మాధవి, కరాటే మాస్టర్ వసంత్ కుమార్, ఇతర ఇన్‌స్పెక్టరు, సిబ్బంది పాల్గొన్నారు.