Karimnagar: ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:23 AM
కరీంనగర్ టౌన్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని 63వ డివిజన్ జ్యోతినగర్ సుష్మాస్వరాజ్ చౌరస్తాలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజయ్‌పాయ్ 101వ జయంతి వేడుకలను
కరీంనగర్ టౌన్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని 63వ డివిజన్ జ్యోతినగర్ సుష్మాస్వరాజ్ చౌరస్తాలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజయ్‌పాయ్ 101వ జయంతి వేడుకలను డివిజన్ శక్తి కేంద్ర ఇన్‌చార్జి రెడ్డెడ్డి శ్రీనివాస్ (బాలు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కోమల ఆంజనేయులు, వెస్ట్‌జోన్ మాజీ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి హాజరై వాజ్‌పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. కార్యక్రమంలో 163వ బూత్ అధ్యక్షుడు ఆంజనేయులు, 164,166 బూత్ అధ్యక్షులు పెద్ది లావణ్య, దయ్యాల కరుణాకర్, నాయకులు దయ్యాల అశోక్‌కుమార్, కొంగర రాజిరెడ్డి, బండారి శ్రీనివాస్, తొటి సురేష్, పెద్ది లక్ష్మినారాయణ, కర్రె భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
- హుజూరాబాద్ : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగిశెట్టి ప్రభాకర్, రావుల వేణు, గంగిశెట్టి రాజు, పైళ్ల వెంకట్‌రెడ్డి, నల్ల సుమన్, రాజశేఖర్, రాజు, శ్రీనివాస్, శశిధర్, పవన్, వాసు, సంజీవరెడ్డి, సంపత్, శ్రీనివాస్, కరుణాకర్, వినయ్, మోహన్, సదయ్య తదితరులు పాల్గొన్నారు.