Karimnagar: అక్రమ నల్లా కనెక్షన్లపై దృష్టి సారించండి
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:06 AM
కరీంనగర్ టౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని మంచినీటి నల్లా కనెక్షన్ల వివరాలతోపాటు అక్రమ నల్లా కనెక్షన్లపై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
- మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
కరీంనగర్ టౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని మంచినీటి నల్లా కనెక్షన్ల వివరాలతోపాటు అక్రమ నల్లా కనెక్షన్లపై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయన మున్సిపల్ సమావేశమందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ల పరిధిలోని సరఫరా చేస్తున్న వారిగా కమర్షియల్, రెసిడెన్షియల్, డబుల్ నల్లాల కనెక్షన్లను, ట్యాప్ నంబర్ల ప్రకారంగా వివరాలను సేకరించాలన్నారు. కమర్షియల్‌గా వాడుతున్న వాటిని గుర్తించడంతోపాటు అక్రమ నల్లాలనుకూడా గుర్తించి వాటి వివరాలను అందించాలన్నారు. ట్యాప్ నంబర్ లేకుండా కనెక్షన్లు ఉంటే అక్రమ నల్లాలుగా గుర్తించి వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అక్రమ నల్లా కనెక్షన్ల ఉన్న వాటికి సరైన డాక్యుమెంట్ సమర్పించి వాటిని రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు. నల్లా పన్నుల బకాయిలపై దృష్టిపెట్టి వసూలు చేయాలని అన్నారు. బకాయి చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలని, సకాలంలో పన్నులు చెల్లించకుంటే నల్లా కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ కనెక్షన్ తీసుకొని కమర్షియల్‌కు వినియోగిస్తే వాటిని కమర్షియల్‌గా మార్చాలని, విలీన గ్రామాల డివిజన్లతో సహా నగరవ్యాప్తంగా నల్లా కనెక్షన్ల వివరాలను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. వీధి దీపాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ప్రతి రోజు వీధి దీపాలపై పర్యవేక్షణ చేసి వెలుగని చోట వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగర ప్రజలకు నీటి సరఫరా సమయం ప్రకారం అందించాలని, లీకేజీలను వెంటవెంటనే అరికట్టి నీరు వృఽథా కాకుండా అధికారులు సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ యాదగిరి, సంజీవ్‌కుమార్, డీఈలు ఓంప్రకాశ్, లచ్చిరెడ్డి, దేవేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అయూబ్‌ఖాన్ పాల్గొన్నారు.