Share News

Karimnagar: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:04 AM

సైదాపూర్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు.

 Karimnagar:   పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

- సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

సైదాపూర్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన సైదాపూర్‌ మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లతో పాటు తడిసిన ధాన్యాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 50 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వర్షం కారణంగా మండల వ్యాప్తంగా చాలా వరకు రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరదలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. ఇప్పటివరకు అధికారులు పంట నష్టంపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయక పోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గుండేటి వసుదేవ్‌, సీపీఎం నాయకులు ఎండీ హుస్సేన్‌ , ఎం రాజయ్య, సతీష్‌, పద్మయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 12:04 AM