Karimnagar: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్వేయం
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:08 AM
చొప్పదండి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని, పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని దళారులకు ఇవ్వవద్దని తెలిపారు. పట్టణంలో అభివృద్ధి పనులకు 15 కోట్లు, కొలిమికుంట గ్రామం నుంచి మల్లన్నపల్లె దేవస్థానం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 3.30 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మహేష్, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.