Share News

Karimnagar: అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు..

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:16 AM

మానకొండూర్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అసత్య ఆరోపణలు మానుకోకపోతే.. నీ జీవిత చరిత్ర, చీకటి దందాను బయటపెడుతా, ఒక్క పోస్టర్‌కు వంద పోస్టర్‌లు వేయిస్తా.. రసమయి నోరు అదుపులో పెట్టుకో.. అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యరానాయణ హెచ్చరించారు.

 Karimnagar:  అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు..

గంగిపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యరానాయణ

మానకొండూర్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అసత్య ఆరోపణలు మానుకోకపోతే.. నీ జీవిత చరిత్ర, చీకటి దందాను బయటపెడుతా, ఒక్క పోస్టర్‌కు వంద పోస్టర్‌లు వేయిస్తా.. రసమయి నోరు అదుపులో పెట్టుకో.. అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యరానాయణ హెచ్చరించారు. మండలంలోని గంగిపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ నామీద ఏమీ నిరూపించలేక పోస్టర్‌లు వేసి కమీషన్‌లు తీసుకుంటున్నవని అసత్య ఆరోపణలు చేస్తున్నవ్‌. ప్రభుత్వమే డబ్బులు ఇస్తలేదు ఎవ్వడు కమీషన్‌లు ఇస్తరు అని అన్నారు. కమీషన్‌లు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాలు విసిరారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి టి సంపత్‌గౌడ్‌, ఎన్‌ రవీంద్రాచారి, ఏఎంసీ చైర్మన్‌ ఎం ఓదెలు, వైస్‌ చైర్మన్‌ ఆర్‌ తిరుమల్‌రెడ్డి ద్యావ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

మండలంలోని గంగిపల్లి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పూలమాల, శాలువాతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

Updated Date - Jul 11 , 2025 | 12:16 AM