Karimnagar: గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:15 AM
భగత్‌నగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): గీత కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే చెల్లించాలని తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర కో-కన్వినర్ బొమ్మగాని నాగభూషణం కోరారు.
భగత్‌నగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): గీత కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే చెల్లించాలని తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర కో-కన్వినర్ బొమ్మగాని నాగభూషణం కోరారు. సోమవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవవన్‌లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు, వృత్తిదారుల రక్షణ, సంక్షేమం, సహకార సంఘాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. స్కిల్ యూనివర్సిటీలో గీత కార్మికులకు కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. గీత కార్మికులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులు చెట్లపై నుంచి పడి మరణాలు సంభవిస్తే ప్రభుత్వం అందించే ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, గొడిసెల తిరుపతిగౌడ్, పైడిపల్లి రాజు, బండారుపల్లి తిరుపతి, నేరెళ్ల సదానందం, తాళ్లపల్లి చంద్రయ్య, మాదారపు రత్నాకర్, బుర్ర మల్లయ్య, రాములు, బుర్ర అశోక్, రంగు శ్రీనివాస్, కుమార్, మార్క శ్రీకాంత్, రాజయ్య పాల్గొన్నారు.