Karimnagar: సబ్ స్టేషన్ల నిర్మాణానికి స్థలాల పరిశీలన
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:47 PM
కరీంనగర్ అర్బన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో కొత్తగా మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ పమేలాసత్పతి గురువారం పరిశీలించారు.
సబ్ స్టేషన్ల స్థల పరిశీలన చేస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో కొత్తగా మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ పమేలాసత్పతి గురువారం పరిశీలించారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఇ కార్యాలయ ప్రాంగణం, జిల్లా పశు వైద్యశాల, మహాత్మా జ్యోతిబాపూలే మైదానం, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణ, కలెక్టరేట్ ప్రాంగణం, ఆటోనగర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్‌బాబు, ఎన్‌పీడీసీఎల్ డీఈ రాజం, ఈఈ శ్రీనివాస్, ఏడిఈలు అంజయ్య, శ్రీనివాస్ లావణ్య, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ నరేందర్ పాల్గొన్నారు.