Karimnagar: డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:47 PM
కరీంనగర్ క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
- ఆకట్టుకున్న రంగవల్లుల పోటీలు
కరీంనగర్ క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలకు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియపరిచే రంగోళి పోటీలు నిర్వహించారు. కరీంనగర్ క్లబ్ వద్ద రోడ్డుపై ఏర్పాటు చేసిన ఈ రంగోళీ పోటీలను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించేందుకు రంగోలి, వాల్ పెయిం టింగ్ కార్యక్రమాలు, ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు సబిత, నర్సింగరాణి, సుగుణ, శ్రీలత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ తిరుపతి, ఎన్‌ఎంబీఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, మర్రి రాజేందర్‌లు పాల్గొన్నారు.