Karimnagar: తీరని యూరియా కష్టాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:57 PM
కరీంనగర్ రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు వేసుకున్న రైతులకు సరిపడా ఎరువులు దొరకగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు వేసుకున్న రైతులకు సరిపడా ఎరువులు దొరకగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన ఎరువులు రైతులు అందక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ రూరల్ మండలానికి యూరియా బస్తాలు తీగలగుట్టపల్లి డీసీఎంఎస్‌కు 230, నగునూర్‌కు 230, దుర్శేడ్ సహకార సంఘానికి 280, చర్లబూత్కూర్‌కు 340 బస్తాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు శనివారం ఉదయమే ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. అధికారులు రైతులకు యూరియా పంపిణీ చేశారు. దుర్శేడ్, చర్లబూత్కూర్‌లో సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు. సోమవారం మరిన్ని యూరియా బస్తాలు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు సర్ది చెప్పారు.
ఫ గంగాధర: వారం రోజులుగా మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. నిత్యం గంగాధర, కురిక్యాల, బూరుగుపల్లి కేంద్రాలకు యూరియా అవసర మున్న రైతులు వచ్చి వేచి చూసి నిరాశగా వెళుతున్నారు. శనివారం గంగాధర సొసైటీకి 15 టన్నులు, కురిక్యాల సొసైటీకి 15 టన్నులు, గంగాధర సొసైటీ పరిధిలో బూరుగుపల్లికి 5 టన్నులు, గంగాధరలో మరో రెండు సెంటర్లకు 5 టన్నుల చొప్పున 45 టన్నుల యూరియా లోడు వచ్చింది. గంటల వ్యవధిలోనే వచ్చిన బస్తాలను రైతులకు అందజేశారు. శనివారం గంగాధర మండలంలో యూరియా కేంద్రాల వద్ద పోలీసుల పహారాలో పంపిణీ చేశారు.
ఫ శంకరపట్నం: మండలంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. శనివారం మండలంలోని గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా మహిళలు, పురుషులు వేర్వేరు లైన్లలో యూరియా కోసం బారులు తీరారు. వరుసలో ఉన్న వారికి సిబ్బంది భూమి విస్తీర్ణాన్ని బట్టి బస్తాలు పంపిణీ చేశారు.
ఫ వీణవంక: మండలంలోని రైతులకు యూరియ కష్టాలు తప్పడంలేదు. శనివారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణానికి 200 యూరియ బస్తాలు రాగా బస్తాల కోసం రైతులు ఉదయం క్యూ కట్టారు. నిర్వాహకులు ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలు ఇచ్చి పొటాషియం బస్తా తీసుకోవాలని షరతులు పెట్టారు. దీంతో రైతులు అవసరం లేకున్నా పొటాషియం బస్తాలు తీసుకెళ్లారు.