Share News

Karimnagar: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:08 AM

హుజూరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.

 Karimnagar:  పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ చొరవతో రూ.1.5 కోట్ల నిధులతో ఏరియా ఆస్పత్రికి 15 రకాల వైద్య పరికరాలు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

హుజూరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఆయన హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి రూ.1.5 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో 15 రకాల వైద్య పరికరాలను, సామగ్రిని అందిచారన్నారు. కృష్ణారెడ్డి సోమవారం వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కరీంనగర్‌లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ప్రస్తుతం వైదకచ కళాశాలకు కేటాయించారన్నారు. అక్కడి ఆస్పత్రిని హుజూరాబాద్‌కు తరలించడానికి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నారాయణరెడ్డి, బీజేపీ నాయకులు పైళ్ల వెంకట్‌రెడ్డి, రాజు, గంగిశెట్టి ప్రభాకర్‌, శశిధర్‌, రమేష్‌, సంజీవ్‌రెడ్డి, కొండాల్‌రెడ్డి, వెంకటేష్‌, చంద్రిక, వీరయ్య, దేవేంద్ర, హరీష్‌, రాజశంకర్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 12:08 AM