Share News

Karimnagar: అంబరాన్నంటిన దసరా సంబరాలు

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:49 PM

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 3 (ఆంరఽధజ్యోతి) : జిల్లా అంతటా గురువారం విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. భక్తుల ప్రత్యేక పూజలు, వాహన, శమీ పూజలతో ఆలయాలు కిటకిటలాడాయి.

Karimnagar:   అంబరాన్నంటిన దసరా సంబరాలు

- ఘనంగా శమీపూజలు

- వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ , రాష్ట్ర మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 3 (ఆంరఽధజ్యోతి) : జిల్లా అంతటా గురువారం విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. భక్తుల ప్రత్యేక పూజలు, వాహన, శమీ పూజలతో ఆలయాలు కిటకిటలాడాయి. శమీ పత్రాలను పెద్దలకు అందించి ఆశీస్సులు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అందజేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లో మహిషాసుర, రావణ సంహారలీలలను కన్నుల పండువలా నిర్వహించారు. పిండివంటలు, కబుర్లు, కాలక్షేపాలతో సంతోషంగా గడిపారు. శమీ, వాహన, అమ్మవార్ల పూజలతో చైతన్యపురి మహాశక్తి ఆలయం జనంతో పోటెత్తింది. పూజల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

- బండి సంజయ్‌కుమార్‌, కేంద్ర మంత్రి

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆకాక్షించారు. ఉత్తమ సంఘటిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. భరతమాతను విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీకి ప్రజలు అండగా నిలవాలని, దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపే శక్తిని మోదీకి అమ్మవారు ప్రసాదించాలని కోరుకుం టున్నాని అన్నారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఫ గిద్దెపెరుమాళ్ల ఆలయంలో జన సందోహం

రాంపూర్‌ గిద్దెపెరుమాళ్ల ఆలయంలో ఉదయం గణపతికి అభిషేక అర్చనలు, వాహన పూజలు, మధ్యాహ్నం శమీపూజ, ఆలయ సమీపంలో రాత్రి మహిషాసుర సంహారలీలను నిర్వహించారు. శమీ పూజలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ కోడూరి సత్యనారాయణగౌడ్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చేర్ల పద్మ, జిల్లా అధ్యక్షురాలు కె ప్రసన్నారెడ్డి, దేవాదాయశాఖ సహాయ కమీషనర్‌ నాయిని సుప్రియ, ఈఓ ఎండపెల్లి మారుతి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు.

ఫ మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో...

మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో కార్పొరేటర్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జరిగిన శమీపూజ, రాంలీల వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. మహిళలు దాండియా ఆడుతూ సందడి చేశారు.

మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో రాంలీల కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సాయంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్‌ జమ్మిపూజ చేసి శుభాకాంక్షలు తెలిపి సందేశమిస్తున్న తరుణంలో కొందరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జై గంగుల అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తున్నవారిని పోలీసులు మైదానం నుంచి బయటకు పంపారు. మరి కొదరు జై పొన్నం లంటూ నినాదాలు చేశారు. మంత్రి పొన్నం జమ్మిపూజ అనంతరం వెళ్లిపోయారు. వేదిక కార్యక్రమాలు సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి చేపట్టారు. రాంనగర్‌ యూత్‌ కమిటీ సభ్యులు మాజీ కార్పొరేటర్‌ బోనాల శ్రీకాంత్‌ను కూడా వేదికపైకి ఆహ్వానించారు. ఇంతలో వేదిక వద్దకు ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్‌ రాగా మరో సారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే కార్యకర్తలు తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఎంఎల్‌ఏకు ఫిర్యాదు చేయడంతో ఆయన పోలీసులను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుడా చైర్మన్‌, ఎంఎల్‌ఏ కలసి విల్లు ఎక్కు పెట్టి మహిషాసుర సంహారాన్ని ప్రారంభించారు.

ఎల్‌ఎండీలో ఘనంగా రాంలీలా

తిమ్మాపూర్‌, అక్టోబరు 3, (ఆంధ్రజ్యోతి): మండలంలో మహాత్మానగర్‌ గ్రామం ఎల్‌ఎండి కాలనీలో గల రిక్రియేషన్‌ క్లబ్‌ మైదానంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతియోటా నిర్వహించే రాంలీలా వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ప్రారంభించారు. జనాల కేరింతల నడుమ రావణాశురిడి దహణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈసారి స్థానిక సంస్ధల ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఎలాంటి హంగు అర్బాటాలు లేకుండా కార్యక్రమం ముగించారు.

రాజకీయాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి

- ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

గతంలో 1996వ సంవత్సరంలో రాంలీలా కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారో ఆదే విధంగా రావణ దహణం చేసినట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. దీనికి గత పాలకులు రాజకీయం రుద్ది, ఈ రాంలీలా కార్యక్రమ నిర్వహణ కోసం డబ్బులు వసూలు చేసి, తన సినిమాల రిలీజ్‌ కోసం దీన్ని వేదికగా వాడుకుని రాజకీయాలు చేశారని అన్నారు. రాజకీయలకతీతంగా పండుగలు చేసుకోవాలని నిర్ణయించి రాంలీలా కార్యక్రమం నిర్వహించి నట్లు తెలిపారు. సాంస్కృతిక శాఖ చైర్మన్‌ అయి ఉండి రాంలీలా పేరుతో 20లక్షల రూపా యలు వసూలు చేశారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కవ్వంపల్లి సత్యనారాయణ ఘటుగా ఆరోపణ చేశారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. తిమ్మా పూర్‌ సీఐ సదన్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంలీలా కమిటీ చైర్మన్‌ కుంట రాజేందర్‌రెడ్డి, కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2025 | 11:49 PM