Karimnagar: దసరా ధమాకా...
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:52 PM
కరీంనగర్ క్రైం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విసయదశమి పెద్ద పండుగ... పల్లెటూరు నుంచి పట్టణాల వరకు దసరా పండుగ రోజు మద్యం, మాంసం లేనిదే పూటగడవదు అన్నట్లుగా తెలంగాణ ప్రజలు వేడుకలు ఘనంగా జరుపుతుంటారు.
- కరీంనగర్ మద్యం డిపోలో 3 రోజుల్లో 45 కోట్ల అమ్మకాలు
కరీంనగర్ క్రైం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విసయదశమి పెద్ద పండుగ... పల్లెటూరు నుంచి పట్టణాల వరకు దసరా పండుగ రోజు మద్యం, మాంసం లేనిదే పూటగడవదు అన్నట్లుగా తెలంగాణ ప్రజలు వేడుకలు ఘనంగా జరుపుతుంటారు. అయితే ఈసారి విజయదశమితోపాటు మహాత్మా గాంధీ జయంతి ఒకే రోజు(అక్టోబరు 2వతేదీ) రావటంతో మందుబాబులకు కొంత నిరశే ఎదురయింది. జిల్లా వ్యాప్తంగా అక్టోబరు 2న మాంసం, మద్యం విక్రయాలు జరుపరాదంటూ మున్సిపల్ శాఖ, గ్రామపంచాయతి శాఖల ప్రభుత్వ అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. కొన్ని ప్రాంతాల్లో డప్పుచాటింపు కూడా నిర్వహించారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో యథేచ్ఛగా మాంసం, మద్యం అమ్మకాలు కొనసాగినట్లు తెలుస్తోంది. పేరుకు వైన్‌షాపులు, చికెన్ మటన్ షాపులు బంద్ అని మూసివేసినప్పటికీ రహస్యంగా మాంసం, మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం ప్రియలు దసరా వేడుకల కోసం ముందస్తుగా సెప్టెంబరు 29, 30, అక్టోబరు 1న మద్యం కొనుగోలు చేశారు.
ఫ కరీంనగర్‌లోని మద్యం డిపోలో 3 రోజుల్లో 45 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. అక్టోబరు 2, 3న సెలవు దినం కాబట్టి మద్యం డిపో తెరవలేదు. సెప్టెంబరు 29, 30, అక్టోబరు 1న కలిపి 45 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. సెప్టెంబరు 29న 21 కోట్లు, 30న 19 కోట్లు, అక్టోబరు 1న 5 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. కరీంనగర్‌లోని మద్యం డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని 244 వైన్‌షాపులు, బార్‌లకు విస్కీ, బ్రాంది, బీరు, రమ్, వోడ్కా, జిన్ వంటి మద్యం సరఫరా అవుతుంటుంది. ఈ మూడు రోజుల అమ్మకాలు దసరా పండుగ అమ్మకాల కిందకే వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు యదేచ్ఛగా కొనసాగటం గమనార్హం. ఇటు పోలీసులుకానీ అటు ఎక్సైజ్ అధికారులు కానీ ఎక్కడా మద్యం పట్టుకున్న దాఖలాలు కనిపించలేదు.