Share News

Karimnagar: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలి

ABN , Publish Date - May 23 , 2025 | 12:40 AM

సుభాష్‌నగర్‌, మే 22(ఆంధ్రజ్యోతి): అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు.

 Karimnagar:  ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలి

సుభాష్‌నగర్‌, మే 22(ఆంధ్రజ్యోతి): అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. గురువారం ఎంఎల్‌హెచ్‌పీ, పీహెచ్‌సీ సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొదటి కాన్పు, సాధారణ కాన్పు అయ్యేలా ప్రోత్సహించాలన్నారు. సిజేరియన్‌ డెలివరీ వల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలను గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించాలని సూచించారు. ప్రతి గర్భిణికి గైనకాలజీ డాక్టర్‌తో హెల్త్‌ చెకప్‌ చేయించాలన్నారు. 30 సంవత్సరాల పై వారందరికి రక్తపోటు, షుగర్‌ పరీక్షలు చేయాలని, నిర్ధారణ అయినవారందరికి ఉచితంగా మందులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్నందున దోమలు, వాటివల్ల సంభవించే వ్యాధుల నివారణకుగాను ప్రతి శుక్రవారం డ్రైడేను ప్రజలందరు తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. 21 నుంచి 28 వరకు రెండో విడత ఇమ్యూనైజేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నందున పిల్లలందరికి టీకాలు తప్పకుండా ఇప్పించాలన్నారు. సమావేశంలో డీఐవో డాక్టర్‌ సాజిద, ఎంసీహెచ్‌పీవో డాక్టర్‌ సనజవేరియా, డీఎంవో డాక్టర్‌ శైలేంద్ర, డెమో రాజగోపాల్‌, డీపీఎం స్వామి పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:40 AM