Share News

Karimnagar: మాస్టర్‌ ప్లాన్‌పై సూచనలు, అభ్యంతరాలకు గడువు ఈ నెల 28

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:24 PM

కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెల 28తో గడువు ముగియనుందని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు.

Karimnagar:   మాస్టర్‌ ప్లాన్‌పై సూచనలు, అభ్యంతరాలకు గడువు ఈ నెల 28

- ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెల 28తో గడువు ముగియనుందని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సుడా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాస్టర్‌ ప్లాన్‌, ఇంతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల తర్వాత అమలయ్యే నూతన మాస్టర్‌ ప్లాన్‌పై అవగాహన కల్పించడానికి మూడు నెలల సమయం ఇచ్చామన్నారు. సమయం ముగిసిన తర్వాత ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోబోమని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, సీపీవో ఆంజనేయులు, ఈఈ రొడ్డ యాదగిరి, డీఈ రాజేంద్రప్రసాద్‌, ఏఈ సతీష్‌, ఏసీపీలు బషీర్‌, వేణు, శ్రీధర్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:24 PM