Share News

Karimnagar: సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:09 AM

భగత్‌నగర్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): సీపీఐ పార్టీ ఆవిర్భవించి సీపీఐ డిసెంబరు 26 నాటికి వందేళ్ళు పూర్తవుతాయని, ఈ సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Karimnagar:   సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): సీపీఐ పార్టీ ఆవిర్భవించి సీపీఐ డిసెంబరు 26 నాటికి వందేళ్ళు పూర్తవుతాయని, ఈ సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఊరూరా, వాడవాడనా సీపీఐ జెండాలు ఎగుర వేయాలన్నారు. పార్టీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలను ప్రజలకు వివరించాలన్నారు. ర్యాలీలు, సభలు, సెమినార్లు, నిర్వహిస్తూ, జనసేవాదళ్‌ క్యాంపులు నిర్వహించే జాతాను జిల్లాల్లో విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీపీఐ వందేళ్ల ఉత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. డిసెంబరులో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జాతా నిర్వహించి ప్రజల పక్షాన నిలిచి పోరాడేది సీపీఐ అని ప్రజలకు తెలియజేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పొనగంటి కేదారి, అందే స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, బోయిన అశోక్‌, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిన తిరుపతి, పిట్టల సమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 12:09 AM