Share News

Karimnagar: కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:16 PM

కరీంనగర్‌ కల్చరల్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్మార్ట్‌ సిటీ నిధులతో నూతనంగా నిర్మించే భవన నిర్మాణంపై గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలో చర్చ జరిగింది.

Karimnagar:   కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

- మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ కల్చరల్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్మార్ట్‌ సిటీ నిధులతో నూతనంగా నిర్మించే భవన నిర్మాణంపై గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలో చర్చ జరిగింది. సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌కి వివరించారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయించాలని కమిషన ర్‌ను కోరారు. నిర్మాణం పూర్తయితే పాఠకులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రెండు నెలల్లో నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. అలాగే ఎస్టిమేషన్‌ ప్రక్రియ పూర్తయినందున గ్రంథాలయ ఆవరణలో రంగులు, వెలుపల గోడలకు రంగులు, చిత్రాలు వేసే పని కూడా వారంలోగా పూర్తి చేయాలని తెలిపారు.

Updated Date - Jul 17 , 2025 | 11:16 PM