karimnagar : భారతీం సుప్రసన్నాం...
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:42 AM
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్ర్యుత్సవాల్లో మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం దుర్గాదేవి సరస్వతీమాతగా దర్శనమివ్వనుంది.
- నేడు మూలా నక్షత్రం... సరస్వతీ అలంకారం
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్ర్యుత్సవాల్లో మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం దుర్గాదేవి సరస్వతీమాతగా దర్శనమివ్వనుంది. మూలా నక్షత్రం సందర్భంగా పలు ఆలయాలు, మండపాల్లో ప్రత్యేక పూజలతోపాటు అలంకారాలను, ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. నగరంలో ప్రధానంగా చెప్పుకునే సరస్వతీమాత కొలువైన మూడు ఆలయాల్లో దుర్గామాతకు సరస్వతీ మాత రూపంలో విశేష పూజలు జరుపనున్నారు. విద్యార్థులతో పూజలు, పల్లకీ సేవలు, హోమాలు నిర్వహించనున్నారు. చైతన్యపురి మహాశక్తి ఆలయం, బొమ్మకల్ రోడ్ యజ్ఞవరాహస్వామి దేవాలయంలోని వాగ్వాదినీ మహాసరస్వతి ఆలయం, గాయత్రీనగర్ గణేశ శారదా శంకరాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఆయా ఆలయాల్లో అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకోనున్నారు. అన్ని దేవాలయాల్లో, మంఛిపాల్లో అర్చనలు, అభిషేకాలు, గణేశ, శారదా హవనాలను జరపనున్నారు.