Share News

Karimnagar: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:12 AM

తిమ్మాపూర్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తమ పిల్లలను అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి కొరారు.

Karimnagar:  పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

రేణికుంటలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి ఇంగ్లీషు చదువు బోధిస్తున్న జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

తిమ్మాపూర్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తమ పిల్లలను అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి కొరారు. మండలంలోని రేణికుంట గ్రామంలో రైతు వేదికలో మహిళాభివృఽధ్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శుక్రవారం సభలో ఆమే పాల్గొన్నారు. శుక్రవారం సభ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా కలెక్టర్‌ కట్‌ చేశారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్బంగా పోషకాహారం స్టాల్‌ను జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు చదువుకోవాల్సిన అవసరం ఉందని, చదువు మద్యలో అపేసిన వారు ఓపెన్‌ స్కూల్లో చేరి పదవ తరగతి, ఇంటర్‌ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి మహిళ ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలకు సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేట్‌ అసుపత్రులను ఆశ్రయించి సీజేరియన్‌ చేయించుకోవద్దని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గర్భిణీలకు నాలుగు ఉచిత వైద్య పరీక్షలతో పాటు టిఫా స్కానింగ్‌ చేయిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిడీవో విజయ్‌ కుమార్‌, ఎంఈవో శ్రీనివాస్‌, సిడిపివో శ్రీమతి, ఇతర అధికారులు, సిబ్బంది, మహిళాలు పాల్గొన్నారు.

పిల్లలకు పాఠాలు బోధించిన కలెక్టర్‌

రేణికుంట గ్రామంలో గల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించారు. పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్ధులతో ఇంగ్లీషు పాఠాలను చదివించారు. చదవడంలో మెళకువలను నేర్పిస్తూ వారితో పాటు ఇంగ్లీషు పాఠం జిల్లా కలెక్టర్‌ కూడా చదివారు. ప్రాథమిక విద్యార్ధులకు సులభంగా ఆర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాద్యాయులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పూర్వ ప్రాథమిక విద్య జూలై నెల సిలబస్‌ను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:12 AM