Share News

karimnagar : ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:05 AM

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ శివారులోని మానేరు జలాశయం కట్టపై సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది.

karimnagar :   ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

- సెలవురోజు, చల్లటి వాతావరణంతో ఆసక్తి

- డ్యాంలో ఆశించిన స్థాయిలో చేరని నీరు

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ శివారులోని మానేరు జలాశయం కట్టపై సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. నాలుగు రోజులుగా వర్షాల మూలంగా కరీంనగర్‌ నగర ప్రజలు ఇళ్లకే పరిమితమవగా ఆదివారం వర్షాలకు కొంత విరామం ఇవ్వటంతో పాటు సెలవు రోజు కావటంతో సాయంత్రం సమయంలో నగరవాసులు ఒక్కసారిగా డ్యాంకట్టపైకి వాహనాలతో రావటంతో కిక్కిరిసిపోయింది. అయితే డ్యాంకట్టపైన గేట్ల సమీపంలోకి ఇంతకు ముందు వాహనాలను అనుమతించకుండా లేక్‌ అవుట్‌పోస్ట్‌ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకు నేవారు. ప్రస్తుతం కట్టకింది భాగంలో, కట్టపై ఎలాంటి బారికేడ్లు లేనందున సందర్శకులు వందలాది వాహనాలతో గేట్ల సమీపంలోకి వెళ్లారు. దీంతో డ్యాంకట్టపై వాహనాల రాకపోకలతో పాటు సందర్శకులకు ఇబ్బంది తలెత్తింది. మానేరు జలాశయంలో 24 టీఎంసీ సామర్ధ్యం ఉన్నప్ప టికీ ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. డ్యాం గేట్ల సమీపంలో మాత్రమే నీరు ఉండగా మిగతా ప్రాంతమంతా ఎడారిగా మారింది. అయినప్పటికీ సందర్శకులు ఆదివారం ఒక్కసారిగా డ్యాంకట్టపై రావటంతో అక్కడ విధుల్లో ఉన్న లేక్‌ అవుట్‌పోస్ట్‌ సిబ్బంది కూడా నిలువరించలేక పోయారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటం, గోదావరి నది ఉప్పోంగి ప్రవహిస్తుండ టంతో మానేరు జలాశయంలోకి కూడా భారీగా నీరు వచ్చి చేరుతుందని భావించిన సందర్శకులు డ్యాంకట్టపైకి వచ్చినట్లు చెపుతున్నారు.సెలవు రోజు కావటం, సాయంత్రం వేళ చల్లటి వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో నగరవాసులు చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి కార్లలో కట్టపైకి రావటంతో సందర్శకరులతో నిండిపోయింది. డ్యాంకట్టపై రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి వేయటంతో ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. గమనించిన పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. తిమ్మాపూర్‌ మండలంలోని మహా త్మానగర్‌ శ్రీ తాపాల నృసింహస్వామి దేవాలయం సమీపం నుంచి ఎల్‌ఎండీ కట్టపై నుంచి కింద డ్యాం నీటి వరకు వాహనాలు, సందర్శకులతో నిండిపోయింది. నీటి ప్రవాహం ఉన్న చోట వరకు వెళ్లి కుటుంబ సమేతంగా, స్నేహితులు, బంధువులు కలిసికట్టుగా సరదాగా గడిపారు. జనం తాకి డి పెరుగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అందరినీ పంపించివేశారు.

Updated Date - Jul 28 , 2025 | 01:05 AM