Share News

Karimnagar: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాన్ని తీసుకరావాలి

ABN , Publish Date - May 29 , 2025 | 11:59 PM

సైదాపూర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టం తీసుకరావాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి అన్నారు.

Karimnagar:   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాన్ని తీసుకరావాలి

- ధరణిలో లోపాలను అధిగమించేందుకే భూభారతి చట్టం

- రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి

- రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

- సైదాపూర్‌లో వికసిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ ప్రారంభం

సైదాపూర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టం తీసుకరావాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వికసిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ ప్రారంభోత్సవం సైదాపూర్‌ మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరెడ్డి మాట్లాడుతూ వికసిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రైతుల వద్దకు దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు వెళ్లి వ్యవసాయంలో నూతన ఆవిష్కరణల గురించి తెలియ జేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు బిడ్డ అని, అందుకే రైతులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. ధరణిలో అనేక లోపాలు ఉండడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని, ఆ లోపాలను సవరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుక వచ్చిందన్నారు. ఉపాధిహామీ పనులను వ్యవసాయానికి అనుసందానం చేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. రైతులను అభివృద్ది చెసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ కమీషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. ప్రతీ గ్రామంలో రైతులకు అండగా ఉండే విదంగా ఆదర్శ రైతును నియమించే విదంగా కొత్త పాలసీ తీసుకవస్తున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటిస్తారన్నారు.

ఫ 15 రోజుల పాటు వికసత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌

ఈ నెల 29 నుంచి జూన్‌ 12 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వికసిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమం ఉంటుందని డీడీజీ, ఐసీఏఆర్‌ (ఎడ్యుకేషన్‌) అగ్రవాల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలతో పాటు ఐటీఆర్‌ఆర్‌, ఎన్‌ఏఏఆర్‌ఎం శాస్త్రవేత్తలు పాల్గొంటారని రైతుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కార మార్గాలు చూపుతారన్నారు. కార్యక్రమంలో అటారి జోన్‌ డైరెక్టర్‌ షేక్‌యన్‌ అటారి, టీఎస్‌ఎస్‌ఓసీఏ డైరెక్టర్‌ కేశవులు, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:59 PM