karimnagar : పనులు పూర్తి చేయరా?
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:01 AM
మానకొండూర్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట-మానకొండూర్ రోడ్డు అధ్వానంగా మారింది. లోలెవల్ బ్రిడ్జిలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- గుంతల మయంగా మానకొండూర్-జమ్మికుంట రోడ్డు
- అసంపూర్తిగా లోలెవల్ బ్రిడ్జిలు
- వర్షాలు కురిస్తే తీవ్ర ఇబ్బందులు
మానకొండూర్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట-మానకొండూర్ రోడ్డు అధ్వానంగా మారింది. లోలెవల్ బ్రిడ్జిలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ఏర్పడ్డ గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ఈరోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. వర్షాకాలం వచ్చింది. లోలెవల్ బ్రిడ్జిలతో ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోతాయి. ఈ రోడ్డు నిర్మాణానికి ఏడేళ్ల క్రితం అప్పటి రాష్ట్రప్రభుత్వం 70 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మానకొండూర్ గ్రామ పంచాయతీ నుంచి జమ్మికుంట వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఫ ఏళ్లు గడిచినా అసంపూర్తిగా..
ప్రారంభం నుంచి ఈ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మానకొండూర్ మండలంలోని పచ్చునూర్ నుంచి మానకొండూర్ వరకు ఆయా గ్రామాల ప్రజలు పలుసార్లు ఆందోళనలు చేయడంతో ఆరేళ్లకు అరకొరగా పూర్తి చేశారు. అన్నారం నుంచి మానకొండూర్ వరకు తారు రోడ్డు లేక ప్రయాణికులు ఆరేళ్లు దుమ్మూ ధూళి మధ్య అనేక ఇబ్బందులతో ప్రయాణం కొనసాగించారు. మానకొండూర్, అన్నారం గ్రామాల్లో రోడ్డు వెడెల్పు పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ గ్రామాల్లో హడావుడిగా పనులు పూర్తి చేశారు.
ఫ ప్రమాదకరంగా వంతెనలు
లలితాపూర్, అన్నారం, మానకొండూర్ గ్రామాల్లోని లో లెవల్ బ్రిడ్జినిర్మాణ పనులతోపాటు పోచంపల్లి డీబీఎం 6 ఉపకాల్వపై నిర్మించిన బ్రిడ్జిచెడిపోయి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా పదిమీటర్ల మేరకు తారు రోడ్డు నిర్మాణం చెపట్టలేదు. దీంతో ఆ ప్రాంతం గుంతలమయంగా తయారైంది. వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము లేచి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడడమే కాకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలంలో లో లెవల్ బ్రిడిల్జపై నుంచి వరద నీరు ప్రహించడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. అన్నారంలో నెల రోజుల క్రితం లోలెవల్ బ్రిడ్జికి ఇరువైపులా పైపులు వేసి మద్యలో వదిలిపెట్టారు. మానకొండూర్‌లో పూర్తి స్థాయిలో పైపు లైన్ నిర్మాణ పనులు చేపట్టి తారు రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలతో ప్రయాణీకులు కోరుతున్నారు.
ఫ ప్రతిరోజు వందలాది వాహనాలు
కరీంనగర్ నుంచి జమ్మికుంటకు ప్రతి రోజు 30 వరకు ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. మండలంలోని ఊటూర్, వీణవంక మండలంలోని మానేరు వాగు నుంచి ప్రతి రోజు వందలాది ఇసుక లారీలు హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట తదితర పట్టణాలకు ఇసుకను తరలిస్తుంటాయి. దీంతో ఈ రోడ్డంతా ఎప్పుడు రద్దీగా ఉంటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరువైపుల కిలోమీటర్ మేరకు లారీలు వెళెతుండడంతో రోడ్డు దాటాలంటనే ఆయా గ్రామాల ప్రజలు భయడుతున్నారు.