Karimnagar: జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ సంబరాలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:23 AM
హుజూరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపును హర్షిస్తూ శుక్రవారం బీజేపీ నాయకులు హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు.
హుజూరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపును హర్షిస్తూ శుక్రవారం బీజేపీ నాయకులు హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదలపై భారం పడకుండా నరేంద్రమోదీ జీఎస్టీని తగ్గించారన్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు లాభం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో టి రాజు, ప్రభాకర్, శ్రీనివాస్, వేణు, రాజు, సుమన్, అజార్, రమేష్, శశిధర్, కొండాల్‌రెడ్డి, చైతన్యరెడ్డి, దేవరాజు, కరుణాకర్, చంద్రిక, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.