Share News

Karimnagar: మోదీ కానుకగా విద్యార్థులకు సైకిళ్లు

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:13 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) మోదీ కానుకగా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సిద్ధమయ్యారు.

Karimnagar:   మోదీ కానుకగా విద్యార్థులకు సైకిళ్లు

విద్యార్థులకు అందించేందకు సిద్ధమవుతున్న సైకిళ్లు

- పదో తరగతి విద్యార్థులకు 20 వేల సైకిళ్ల పంపిణీ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మోదీ కానుకగా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సిద్ధమయ్యారు. ఈ నెల 11 తన పుట్టిన రోజును పురస్కరించుకుని కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్‌ స్కూళ్లలో చదివే పదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్‌ ఇచ్చారు. ఇప్పటికే 5 వేల సైకిళ్లు కరీంనగర్‌కు చేరుకున్నాయి. ఒక్కో సైకిల్‌ను రూ.4 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్‌ రాడ్‌కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోవైపు బండి సంజయ్‌ ఫొటో ముద్రించ నున్నారు. పదో తరగతి విద్యార్థులు స్పెషల్‌ క్లాసులకు హాజరుకావాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:13 AM