Share News

Karimnagar: బతుకమ్మ చీరలను మహిళలందరికీ అందించాలి

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:02 AM

భగత్‌నగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోకి మహిళలందరికి దసరా కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గూడెం లక్ష్మి అన్నారు.

Karimnagar:  బతుకమ్మ చీరలను మహిళలందరికీ అందించాలి

భగత్‌నగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోకి మహిళలందరికి దసరా కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గూడెం లక్ష్మి అన్నారు. కరంనగర్‌లో జాతీయ మహిళా సమాఖ్య నగర కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే పంపిణి చేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. ఇది శోచనీయమన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు కొట్టె అంజలి, బీర్ల పద్మ, ఎలిశెట్టి భారతక్క, ఉప్పల శ్రీగుణ, గుమ్మడి సుజాత, బీర్ల రజిత పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 12:24 AM